అర్నబ్ తర్వాత ఒడిశాలో జలప్రళయం.. బెర్హాంపూర్‌లో నీటమునిగిన ప్రాంతాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Cyclone Arnab ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఒడిశాలోని గంజాం జిల్లా అతలాకుతలమైంది. బెర్హాంపూర్ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
గంజాం జిల్లాలోని పలు రహదారులు, గ్రామాల్లోకి వరదనీరు చేరగా రోడ్డు కనెక్టివిటీ దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో వంతెనలపై నాలుగు అడుగుల వరకు నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు.
గత 24 గంటల్లో బెర్హాంపూర్‌లో 132.4 మి.మీ. వర్షపాతం నమోదవగా, గంజాం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో 150 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. నదులు, రిజర్వాయర్ల నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.





