పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కర్టెన్ రైజర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.
ఈ సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే ‘Invest Telangana Global Summit 2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ముందుంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
డిసెంబర్ 7–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రధాన Global Summit నిర్వహించనున్నారు.
వాతావరణ మార్పులను ప్రత్యేక సబ్-థీమ్‌గా చేర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు.





