మాటల్లో కాదు.. రక్తదానం చేసి ముందుండిన డీసీపీ శిల్పావల్లి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పోలీసులు స్వయంగా ముందుండి ఆదర్శంగా నిలిచారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా రక్తదానం చేశారు.
మరోవైపు మధురానగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకటరెడ్డి, మధురానగర్ ఇన్‌స్పెక్టర్ సందర్శించారు. రక్తదానం చేసిన యువతకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.
అమరవీరులకు నివాళి.. అవసరంలో ఉన్నవారికి ప్రాణదానం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





