‘ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను’.. కవిత సంచలన వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీఆర్ఎస్‌తో తన రాజకీయ సంబంధాలపై కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టత ఇచ్చారు. “నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు” అని తేల్చిచెప్పారు.
తన కుటుంబం ఎదుర్కొన్న పరిణామాలను ప్రస్తావిస్తూ, రాజకీయాల్లో లేని తన భర్త అనిల్ కుమార్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలోనూ ఆమె ఇదే తరహా ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్‌తో తిరిగి కలిసి పనిచేసే అవకాశం లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.





