శంషాబాద్‌లో నిలిచిపోయిన ఖతార్ ఎయిర్‌లైన్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తెల్లవారుజామున వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో.. ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణికులకు విమానాశ్రయంలోని వివిధ హోటల్స్‌లో బస ఏర్పాటు చేశారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రేపు తెల్లవారుజామున విమానం దోహా వెళ్లనుందని అధికారులు తెలిపారు.





