అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో మరోమారు సమీక్షించారు. అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి పరిస్థితిని అంచనా వేసి.. తీరప్రాంత ప్రజలను షెల్టర్లకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని సీఎం సూచించారు.





