హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు పడింది. మెట్రో ఫేజ్-2లో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.
ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం ₹24,269 కోట్లు. ప్రతిపాదిత మార్గాలు ఇవే—
నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్
MGBS – చంద్రాయణగుట్ట
మియాపూర్ – పటాన్‌చెరు
LB నగర్ – హయత్‌నగర్
ఈ ఐదు కారిడార్లతో నగరంలోని ఎయిర్‌పోర్ట్, ఐటీ కారిడార్, ఓల్డ్ సిటీతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ మరింత విస్తరించనుంది.
2029 నాటికి ఫేజ్-2 పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.





