తెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రానికి నీళ్లు వదిలేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రం సీఎం వంద రోజులు 24 గంటలు పట్టిసీమ మోటార్లు నడిపితే.. ఇక్కడ మాత్రం మోటార్లు నడపడం చేతకాక కిందకు వదిలారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క సాగర్, దేవాదుల పూర్తి చేసి ఇస్తే మీరెన్ని గంటలు నడిపారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని కరువును వరంగల్ జిల్లా ప్రజల మీద రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు.





