ఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల్లో ఎస్ఈసీ రూల్స్ పాటించడం లేదని.. పోలీసులే టీడీపీ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆరోపించారు. ఏకగ్రీవాల పేరుతో అధికారులను బెదిరించి నామినేషన్లు తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ చూస్తూ కూర్చుంటే.. ప్రభుత్వానికే ముప్పు వస్తుందని హెచ్చరించారు.





