టీజీపీఎస్సీ ఏఈ పరీక్ష తేదీ మార్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎస్సెస్సీ జేఈ, టీజీపీఎస్సీ ఏఈ పరీక్షల తేదీలు ఒకేరోజు రావడంతో.. అభ్యర్థుల ఆందోళన మేరకు టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6న జరగాల్సిన ఏఈ పరీక్షను.. క్లాష్ అయిన అభ్యర్థుల కోసం నవంబర్ 7న నిర్వహించనున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ వివరాలను అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటలలోపు మెయిల్ చేయాలని సూచించారు. ఎస్సెస్సీ జేఈ హాల్ టికెట్, ఏఈ దరఖాస్తు కాపీ, ఓటీఆర్ ఐడీ పంపాలని కమిషన్ స్పష్టం చేసింది.





