తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ పరస్పర ఆరోపణలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. గన్నేవారిపల్లి కాలనీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనలో వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి గాయపడి ఆసుపత్రికి తరలించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు తిమ్మంపల్లి ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం పరిసరాల్లో రాళ్ల దాడులు జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. మరో కేసుకు సంబంధించి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆయనను అనంతపురానికి తరలించినట్లు సమాచారం.
ఇరు పార్టీల నుంచి పరస్పర దాడుల ఆరోపణలు రావడంతో పోలీసులు తాడిపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.





