పంచాయతీ బిల్లులపై సర్కార్ కీలక ఆదేశాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది..
మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారులకు తాజా ఉత్తర్వులు అందాయి..
సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య వివాదాలకు చెక్ పెడుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..
చెక్కులపై సంతకం చేయడంలో ఉప సర్పంచ్ 7 రోజులు దాటి జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది..
ఉప సర్పంచ్ సంతకం చేయకపోతే ఈవో (EO) లేదా ఎంపీడీవో (MPDO) సంతకం చేయవచ్చని స్పష్టం చేసింది.
గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం కానుంది





