తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయంసిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులు

ప్రభుత్వంరాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ.340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల వాసులు కోరుకున్న నేతన్న బజార్‌తో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నారు.

సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులు చేపట్టనున్నారు.

సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలు చేయనున్నారు.

రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణం చేపట్టనున్నారు.

వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేయనున్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు