వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వికారాబాద్‌లో యువ క్రికెటర్ నందిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది.
యాలాల మండలం సంగయ్యపల్లికి చెందిన నందిని, వికారాబాద్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుతో పాటు క్రికెట్‌లో రాణిస్తోంది. ఆమె బీసీసీఐ అండర్-19 స్థాయి క్రీడాకారిణిగా సమాచారం.
కొంతకాలంగా అనిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అతడికి కృష్ణ అనే మరో యువకుడు సహకరించాడని ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఈ వేధింపుల కారణంగానే నందిని తీవ్ర మనస్తాపానికి గురై మధు కాలనీలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.





