తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!
వాతావరణం
📅 తేదీ వారీగా

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!

ప్రత్యేక కథనంజాతీయం
డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కిషన్ రెడ్డి గారితో కలిసి నషా ముక్త్ భారత్ యాత్ర' టీ-షర్టులను ఆవిష్కరించిన చిరంజీవి..!

​హైదరాబాద్:

యువత భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన మద్దతును ప్రకటించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర' నేపథ్యంలో, ఈ మహా యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా చిరంజీవిని కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సమాజాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తాము సైతం ఎల్లప్పుడూ చేయి కలుపుతామని స్పష్టం చేశారు.

​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన "నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్" పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు