కరీంనగర్‌లో కొత్త కలెక్టరేట్ ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (IDOC) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన సీఎం.. కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి, అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.





