ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

సుప్రీంకోర్టు కనీస వయసు తగ్గింపు పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని న్యాయవాది వాదించారు. లోక్‌సభ, అసెంబ్లీ పోటీకి 25 ఏళ్లు; రాజ్యసభ, మండలికి 30 ఏళ్ల నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తమ దరఖాస్తు స్థితిపై ప్రతివాది స్పందించేలా ఆదేశించాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. ఈ అంశంపై ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. కోర్టు సూచనతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం అనుమతించింది.
లోక్‌సభ, అసెంబ్లీ పోటీకి 25 ఏళ్లు; రాజ్యసభ, మండలికి 30 ఏళ్ల నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన చేసింది.
కోర్టు సూచనతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పారు.
పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం అనుమతించింది.





