ఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్' నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' బొమ్మ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు..
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు ఇప్పటికే వేరే కేసులో కస్టడీలో ఉన్నారు..
నిందితుల నుంచి రూ.100, రూ.500, రూ.2000 ముఖవిలువ గల 99 బండిళ్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు..
అసలు నోట్ల మధ్యలో 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' బొమ్మ నోట్లు ఉంచి బాధితులను నిలువునా ముంచుతున్నట్లు గుర్తించారు..
ఈ ముఠాపై గతంలో నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్, జన్నారంలోనూ కేసులు ఉన్నాయి..





