భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు విద్యార్థులకు గాయాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సాయిబాబా ఆలయం సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారు, భద్రాచలం వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది.
వరంగల్‌కు చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు భద్రాచలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.





