తానా పురస్కారాల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన పది మంది ప్రముఖులను తానా సత్కరించనుంది.
పురస్కార గ్రహీతలు: అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకులు డా. రామచంద్ర నాయుడు గల్లా, శ్రీ సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్, శ్రీ జయధీర్ తిరుమల రావు, శ్రీ గడ్డం సమ్మయ్య, శ్రీ చింతకింది మల్లేశం, శ్రీ చింతల వెంకట్ రెడ్డి, శ్రీ దాసరి కొండప్ప.
ఈ వివరాలను తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి తెలిపారు.





