‘పోలీస్ స్టేషన్ పరిధి మాది కాదంటూ ప్రజలను తిప్పొద్దు’.. హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక సూచనలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పోలీసుల సహాయం కోసం వచ్చే ప్రజలకు అధికార పరిధి పేరుతో ఇబ్బందులు ఎదురుకాకూడదని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని సూచించారు.
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ భగవత్‌ను సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్, మల్కాజిగిరి సీపీ సుమతి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మూడు కమిషనరేట్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.





