టెండర్ వేస్తేనే పదవి.. ఏపీలో సర్పంచ్‌ల వేలం పాట!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మద్యం షాపులు, కాంట్రాక్టుల తరహాలోనే ఏపీలో సర్పంచ్ పదవులకు సైతం టెండర్లు వేస్తున్నారు.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీలో ఈ విచిత్రం చోటుచేసుకుంది.
సర్పంచ్ స్థానం జనరల్ మహిళలకు రిజర్వ్ కావడంతో గ్రామస్థులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారినే సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేలా తీర్మానించారు.
తొమ్మిది మంది అభ్యర్థులు చీటీల్లో డబ్బుల వివరాలు రాసి సీక్రెట్‌గా డబ్బాలో వేశారు.
సుదర్శన్ రెడ్డి తన భార్య అఖిల పేరుతో అత్యధికంగా రూ.25.60 లక్షలు రాసి పదవిని దక్కించుకున్నాడు.
గతంలో 21 లక్షలతో ఉన్న రామిరెడ్డి రికార్డును తాజా టెండర్ విధానం బ్రేక్ చేసింది.
ఇటీవల కొప్పలకొండలోనూ ఇదే తరహా వేలం జరగ్గా.. ఇప్పుడు నక్కలపల్లి వంతు రావడం గమనార్హం.





