హైదరాబాద్‌లో నకిలీ వెండి వర్క్ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

కాజు కట్లీపై వెండి పూత అనుకుంటున్నారా?.. అల్యూమినియంతో నకిలీ వర్క్ తయారీ.. హైదరాబాద్‌లో 4 కేంద్రాల గుట్టురట్టు!
హైదరాబాద్‌లో స్వీట్లు, కేకులు, పాన్‌లపై ఉపయోగించే వెండి పూత (వర్క్) పేరుతో అల్యూమినియం రేకులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
చార్మినార్ పరిధిలోని ఇత్తెహాద్ వర్క్ షాప్, యూటీసీ సిల్వర్ లీఫ్స్, ఎం.ఏ. మెట్రో వర్క్ షాప్‌తో పాటు ఫలక్‌నుమాలోని తారా యూనిట్‌లో టాస్క్‌ఫోర్స్ సోదాలు చేపట్టింది.
అసలైన వెండికి బదులుగా చౌక అల్యూమినియంతో రేకులు తయారు చేసి కాజు కట్లీ, కాజు రోల్స్, చమ్‌చమ్ వంటి స్వీట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేకుల అలంకరణకు అల్యూమినియం పూత ఉన్న షుగర్ బాల్స్, పాన్ తయారీకి నకిలీ వెండి రేకులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సోదాల్లో 49 నకిలీ వెండి రేకుల బండిళ్లు, అల్యూమినియం పొడి, తయారీ యంత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఆహారానికి ఉపయోగించే అసలైన వెండి వర్క్‌లో కనీసం 99.9% స్వచ్ఛమైన వెండి ఉండాలని FSSAI నిబంధనలు చెబుతున్నాయి.





