శంషాబాద్‌లో ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపిన ఇద్దరు అరెస్టు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
43 ఏళ్ల వ్యక్తి ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి అమ్మకాలు.. శంషాబాద్‌లో ఇద్దరు అరెస్టు!
హైదరాబాద్ శంషాబాద్‌లోని శాతంరాయిలో నకిలీ మద్యం విక్రయాల వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు.
వంగలి అశోక్ (43) అనే వ్యక్తి, మహమ్మద్ యాకూబ్ పాషా (29) స్క్రాప్ దుకాణం నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో రూ.560 విలువైన చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కానిస్టేబుల్ ధనుంజయ్ ఇచ్చిన సమాచారంతో అశోక్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 10 ఫుల్ బాటిళ్లు, మిక్సింగ్ చేసిన మద్యం సీసాలు, 30కి పైగా ఖాళీ బాటిళ్లను గుర్తించారు.
ఈ వ్యవహారంలో అశోక్‌తో పాటు యాకూబ్ పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





