తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం
నాగార్జునసాగర్ కేంద్రంగా తెలంగాణ, ఏపీ మధ్య మరోసారి జల వివాదం మొదలైంది. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో తెలంగాణలో కొత్త టెన్షన్ నెలకొంది.
ఏపీ సర్కార్ రూ.1,200 కోట్లతో పాల్నాడు తాగునీటి ప్రాజెక్టును చేపట్టింది.
సాగర్‌కు గండి కొట్టి సొరంగాన్ని నిర్మిస్తూ, గ్రావిటీ ద్వారా రోజుకు 160 మిలియన్ లీటర్ల నీటిని తరలించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రాజెక్టులో 200 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 1,658 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం చేపట్టారు.
తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ ఇరిగేషన్ ఈ పనులు చేస్తోంది.
సాగర్ నీటి సేకరణపై అనుమతులు, కేటాయింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాజెక్టుతో సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ఉండగా, ఈ ప్రాజెక్టు మరింత ఆజ్యం పోసింది.
తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఈ ప్రాజెక్టుపై వివరాలు సేకరిస్తున్నారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారులు KRMBకి ఫిర్యాదు చేశారు.





