విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఇంటిని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా!
చక్రాయపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో బాధిత కుటుంబాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.
చక్రాయపాలెం గ్రామానికి చెందిన ఒతుకోలు లక్ష్మయ్య నివాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకుని దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అగ్నిప్రమాదం జరిగిన తీరును, ఆస్తి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.





