చైనా నుంచి వచ్చే అందమైన మహిళలపై ‘స్పై’గా ముద్ర వేస్తుంటారు: ట్రంప్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇటీవలి ఘటనల నుంచి ఆయన పాఠం నేర్చుకున్నట్లు భావిస్తున్నానని మీడియాతో చెప్పారు. అలిస్ హువాంగ్ చైనా గూఢచారా? అనే విషయం తనకు తెలియదని.. అది నిజమో, కాదో నిగ్గు తేలుస్తామన్నారు. చైనా నుంచి వచ్చే అందమైన మహిళలను సాధారణంగా గూఢచారి అని ముద్ర వేస్తుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. జెన్సన్ విషయానికొస్తే.. బ్లాక్‌వెల్ వంటి అత్యాధునిక చిప్‌లను విక్రయించకుండా తాము ఆయన్ను నిరోధించినట్లు చెప్పారు. ఇతర రకాల చిప్‌లను విక్రయించడం వల్ల అమెరికాకు నష్టమేమీ లేదన్నారు.





