శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వలు.. ప్రస్తుతం 48.57 టీఎంసీలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 829.10 అడుగులుగా నమోదైంది.
గడిచిన 9 రోజుల్లో 3.03 టీఎంసీల నీరు తగ్గింది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి ఇన్‌ఫ్లో నిలిచిపోగా, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.
హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల తాగునీటి అవసరాలకు జూలై వరకు నీరు అందేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రభావం పడకుండా నీటి వినియోగాన్ని సమన్వయం చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.





