విజయవాడలో మహిళ దారుణ హత్య.. లాడ్జి గదికి తాళం వేసి నిందితుడు పరారీ!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా గుర్తించారు.
రెండు రోజులుగా భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లాడ్జి గదిలో ఎర్రమ్మ మృతదేహం లభ్యమైంది.
ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన ఎర్రమ్మను హత్య చేసి, గదికి తాళం వేసి నిందితుడు పరారైనట్లు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసిన కృష్ణలంక, సూర్యారావుపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





