విశాఖలో గోనెసంచిలో అప్పుడే పుట్టిన శిశువు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నంలోని మద్దిలపాలెం సమీప పిఠాపురం కాలనీలో డ్రైనేజీ పక్కన గోనెసంచిలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తించారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు సంచిని తెరిచి శిశువును బయటకు తీసి కాపాడారు.
సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో చిన్నారిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉండగా, పీడియాట్రిక్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి, చిన్నారిని వదిలివెళ్లిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.





