శిర్డీ సాయిబాబాను దర్శించుకున్న రామ్ చరణ్
మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా ఆలయాన్ని ప్రముఖ నటుడు రామ్ చరణ్ శుక్రవారం దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్న హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు రామ్ చరణ్‌కు శాలువా కప్పి, బాబా విగ్రహాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
రామ్ చరణ్ రాకతో ఆలయ పరిసరాల్లో అభిమానులు భారీగా గుమిగూడారు.
భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఆయన సాయిబాబా దర్శనం చేసుకున్నారు.
చాలా కాలంగా శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకోవాలని అనుకుంటున్నానని, ఇందుకోసం నిరంతరం ప్రార్థిస్తూ వస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చివరకు సాయిబాబా దర్శనం లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
చిన్నతనంలో ఓసారి శిర్డీకి వచ్చానని, మా ఇంట్లో ఎప్పుడూ సాయిబాబాను స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటామని ఆయన చెప్పారు.
నా పర్యటనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, ఇప్పుడు నా మనస్సు చాలా తృప్తిగా ఉంది, త్వరలోనే మళ్లీ శిర్డీ సాయిని దర్శించుకోవాలని ఉందని ఆయన పేర్కొన్నారు.





