నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి గురైంది. ఉదయం 5:30 నుంచి 6:00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.
రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ, అయ్యప్ప స్వామి దయ వల్ల తమకు ఎటువంటి గాయాలు కాలేదని, తామంతా క్షేమంగా ఉన్నామని శేఖర్ మాస్టర్ వీడియోలో తెలిపారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన, ఇవాళ రాత్రి మళ్లీ షూటింగ్‌కు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.





