ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్.. 12 వేల ఉద్యోగాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడికి కియా ఇండియా ప్రణాళికలు ప్రకటించింది. విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగ్యూ లీ మాట్లాడుతూ సుమారు రూ.17 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో అదనపు తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుతో దాదాపు 12 వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని, సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4.3 లక్షల నుంచి 6.3 లక్షల వాహనాలకు పెరుగుతుందని తెలిపారు.
2017లో ఏపీలో కియా ప్రయాణం ప్రారంభమైందని, తొలి ప్లాంట్ ఏర్పాటులో సీఎం చంద్రబాబు నాయుడు అందించిన సహకారాన్ని గ్వాంగ్యూ లీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొన్నారు.





