ఏపీకి రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.. ఒక్కరోజే 11 ఒప్పందాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,40,705 కోట్ల విలువైన 11 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. వీటి ద్వారా 10,472 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ రూ.15 వేల కోట్లు, ఐఓసీఎల్ రూ.6,600 కోట్లు, గ్రీన్‌జోన్ రెన్యూవబుల్ ఎనర్జీ రూ.8 వేల కోట్లు, కాకినాడ సీపోర్ట్స్ రూ.6,452 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించాయి.
హిందాల్కో రూ.880 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతరిక్ష రంగం కోసం తిరుపతి సమీపంలో 5 వేల ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించింది.
ఒప్పందాలపై సంతకాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు సూచించారు.





