నల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రిటైర్ అయ్యాక చనిపోయాడు.. కానీ రిటైర్‌మెంట్‌కు 3 రోజుల ముందే చనిపోయినట్లు సర్టిఫికెట్! ఉద్యోగం కోసం భారీ స్కామ్
నల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.
2025 మే 31న పదవీ విరమణ పొందిన ఉద్యోగి.. మే 28నే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో రూ.13 లక్షల ఒప్పందం జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులు, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల సిబ్బంది సహా 14 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
నిందితుల నుంచి ₹5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.





