బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా బలగాలతో కలిసి దీపావళి జరుపుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
సైనికులకు ప్రధాని మోదీ మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జవాన్లు 'సందేశే ఆతే హై' పాటను ఆలపించారు.
'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.
ఒకప్పుడు నక్సలిజం ప్రభావం ఉన్న బస్తర్‌లో ఇప్పుడు అభివృద్ధి వికసిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
దేశం కోసం త్యాగాలు చేస్తున్న వీర జవాన్లకు సెల్యూట్ చేసేందుకు వెళ్తున్నానని ఆయన తెలిపారు.





