రాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్లో పడింది.. సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతంలోని ఓ క్రాకర్స్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బయట కాల్చిన రాకెట్ వచ్చి దుకాణంలో పడటంతో పటాకులకు మంటలు అంటుకున్నాయి. దీంతో షాపులో ఉన్న క్రాకర్స్ ఒక్కసారిగా పేలుతూ మంటలు వేగంగా వ్యాపించాయి.
నిమిషాల వ్యవధిలోనే దుకాణంలోని పటాకుల సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టం అంచనా ఇంకా తెలియాల్సి ఉంది.





