🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర–శ్రీనివాస్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
గృహప్రవేశం సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు బహూకరించిన సీఎం.. వారి ఇంట్లోనే సన్నబియ్యంతో తయారుచేసిన భోజనం చేశారు.
సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు భోజనంలో పాల్గొన్నారు.
అనంతరం అక్కడి చిన్నారులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.





