తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

దీపావళి తర్వాత పెరగనున్న బిర్యానీ ధరలు, ముడి సరుకుల భారం వల్లే నిర్ణయం

ప్రత్యేక కథనంజాతీయం
దీపావళి తర్వాత పెరగనున్న బిర్యానీ ధరలు, ముడి సరుకుల భారం వల్లే నిర్ణయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బిర్యానీ ప్రియులకు బిగ్ షాక్.. త్వరలో పెరగనున్న ధరలు..మండిపోతున్న ధరలే కారణం..దీపావళి తర్వాత బిర్యానీ ధరలు పెంపు కు ఆలోచన..

హైదరాబాద్ లో ఆహార ప్రియుల ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ ప్రియులకు చేదు వార్త. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల జేబులకు త్వరలోనే మరిన్ని చిల్లులు పడనున్నాయి. చికెన్,బాస్మతి బియ్యం, మసాలా దినుసుల ధరలు మార్కెట్‌లో విపరీతంగా పెరగడంతో హోటల్ మరియు రెస్టారెంట్ ఇండస్ట్రీ తమ మెనూ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

ముఖ్యంగా బిర్యానీ తయారీకి అత్యంత కీలకమైన బాస్మతి బియ్యం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకాయి. గతంలో కిలో 95 వరకు లభించిన నాణ్యమైన బాస్మతి రైస్ ధర ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యింది. మరోవైపు, చికెన్ ధరలు పౌల్ట్రీ ఫీడ్ వ్యయం పెరగడం వల్ల ఇప్పటికే కిలోకు 300 వరకు చేరాయి. వీటితో పాటు బిర్యానీకి ప్రత్యేక సువాసన, రుచిని ఇచ్చే స్పైసెస్ మసాలా దినుసులు మరియు వంట నూనెల ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగాయి.

ముడి సరుకుల ధరలు ఈ స్థాయిలో పెరగడం తో హోటళ్ల నిర్వహణ వ్యయం బాగా పెరిగిపోయిందనీ నిర్భకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన భారాన్ని ఇకపై భరించడం సాధ్యం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో ధరల సవరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, దీపావళి తర్వాత నుంచే పెంచిన కొత్త ధరలను అమల్లోకి తీసుకురావడానికి రెస్టారెంట్ యజమానులు నిర్ణయించినట్లు సమాచారం.ఈ ధరల పెంపు కారణంగా ప్రతి ప్లేట్ బిర్యానీపై దాదాపు 50 నుండి 100 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ హోటళ్లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు మరియు డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, ఫలితంగా బిర్యానీ ప్రియులకు ఇకపై తమ ఇష్టమైన వంటకం తింటే జేబు ఖాళీ కాక తప్పదని స్పష్టమవుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు