💔 ఫలితం చూడకముందే కన్నుమూసిన దివ్య.. కౌంటింగ్‌లో ఆమెకే విజయం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం MPTC స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య విజయం సాధించారు.
కానీ ఈ విజయాన్ని చూసేలోపే దివ్య శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అస్వస్థతకు గురైన ఆమెను రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో దివ్యకు విజయం దక్కడంతో ధుమంతునిగూడెంలో ఆనందం కంటే విషాదమే ఎక్కువైంది.
తాను ఎంతో కష్టపడి పోటీ చేసిన ఎన్నికల్లో గెలిచినా.. ఆ విజయాన్ని చూడలేకపోయిన దివ్య కథ గ్రామస్థులను కలచివేస్తోంది.





