🚨 పుల్లారెడ్డి స్వీట్స్ కేసుతో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ డ్రైవ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని G. Pulla Reddy Sweets యూనిట్ FSSAI లైసెన్స్ సస్పెన్షన్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థకు వెంటనే లైసెన్స్ పునరుద్ధరించేందుకు కోర్టు నిరాకరించింది.
తాజా తనిఖీలో స్వీట్ తయారీ ప్రాంతంలో బొద్దింకలు, ఫ్రిజ్‌లపై చనిపోయిన పురుగులు, మురికిగా ఉన్న పాత్రలు, తుప్పుపట్టిన ట్రేలు, పరిశుభ్రత లోపాలు ఇంకా ఉన్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.
“ఒక్క సంస్థపైనే కాదు.. రాష్ట్రంలోని అన్ని ఫుడ్ బిజినెస్‌లపై ఒకే విధంగా నిబంధనలు అమలు కావాలి” అన్న దిశగా కోర్టు స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మాంసం–చేపల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, స్ట్రీట్ ఫుడ్ కేంద్రాలపై తనిఖీలు పెంచాలని ఆదేశించింది.
లైసెన్స్ లేకుండా నడుస్తున్న సంస్థలు, కాలం చెల్లిన లేదా కల్తీ ఆహారం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఫుడ్ ఆపరేటర్ల లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.





