🚨 భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్.. తర్వాత ‘మిస్సింగ్’ ఫిర్యాదు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ తన భార్య భవాని (30)ని హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి గోదావరిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
సోషల్ మీడియాలో పరిచయమైన భవానిని నరేందర్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొత్తగూడెంలోని ప్రగతినగర్‌లో నివసిస్తున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేందర్‌పై అనుమానం రావడంతో విచారించగా.. తానే హత్య చేసి భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని పడేసినట్లు చెప్పినట్టు సమాచారం.
అతడు ఇచ్చిన వివరాలతో గాలింపు చేపట్టిన పోలీసులు బూర్గంపాడు మండలం సమీపంలో భవాని మృతదేహాన్ని గుర్తించారు.
హత్యకు అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





