🔥 “పవన్ కల్యాణ్‌ను ఎప్పుడూ అన్నలాగే భావిస్తా” — నారా లోకేష్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా – సీజన్ 2’ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తన అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ కలిసి ఉన్న ఫొటోను కార్యక్రమంలో చూపించగా..
“కష్టకాలంలో ఎవరు మనతో నిలబడ్డారో ఎప్పటికీ మర్చిపోకూడదు. పవన్ కల్యాణ్ గారిని నేను ఎప్పుడూ ఒక అన్నలాగా భావిస్తాను” అని లోకేష్ అన్నారు.
లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక ఎపిసోడ్ నవంబర్ 8 రాత్రి 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.





