🍚 బియ్యం కిలో రూ.66–79కే.. ఎక్కువ వసూలు చేస్తే కేసే! తెలంగాణలో తనిఖీలు ముమ్మరం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సన్నబియ్యం ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ గరిష్ఠ ధరలు ఖరారు చేసింది.
👉 BPT / KNM – కిలో ₹66
👉 RNR / తెలంగాణ సోనా – కిలో ₹74
👉 HMT / JSR – కిలో ₹79
ఈ ధరలనే 26 కిలోల బియ్యం బ్యాగులపై స్పష్టంగా ముద్రించాలని మిల్లర్లు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,686 తనిఖీలు జరగగా.. ETF బృందాలు 55 కేసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు 280 కేసులు నమోదు చేశారు. వీటిలో 35 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి.
కొన్ని చోట్ల 25 కిలోల బియ్యాన్ని 26 కిలోలుగా చూపించడం, అసలు ధరపై ఎక్కువ ధర స్టిక్కర్లు అతికించడం, PDS బియ్యం నిల్వ చేయడం వంటి అక్రమాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.





