🚰 వానాకాలంలోనే వేసవి దాహం.. హైదరాబాద్‌లో ఒక్క నెలలో 2.2 లక్షల వాటర్ ట్యాంకర్లు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్లపై ఆధారపడటం భారీగా పెరిగింది. జలమండలి గణాంకాల ప్రకారం అక్టోబర్ 2026లో ఏకంగా 2,20,887 ట్యాంకర్లు సరఫరా చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సంఖ్య 87,056 మాత్రమే.
అంటే ఏడాదిలోనే ట్యాంకర్ సరఫరా 153 శాతానికి పైగా పెరిగింది.
బుకింగ్స్ కూడా భారీగా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో 48,284 బుకింగ్స్ ఉండగా.. ఈసారి 1,92,889కు చేరాయి.
తక్కువ వర్షపాతం, పడిపోతున్న భూగర్భ జలాలు, బోర్లు ఎండిపోవడంతో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, హఫీజ్‌పేట్ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది.
వేసవి రాకముందే ఈ స్థాయిలో డిమాండ్ పెరగడం.. రాబోయే నెలల్లో నగర నీటి పరిస్థితిపై ఆందోళన పెంచుతోంది.





