😂🚨 UPIలో లంచం.. ట్రాన్సాక్షన్ హిస్టరీతో అడ్డంగా దొరికిన ఫైర్ సిబ్బంది!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీపావళి క్రాకర్ షాపుల అనుమతుల పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఉప్పల్ భగాయత్‌లోని ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్‌పై ACB ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఫైర్ స్టేషన్ సిబ్బంది మొబైళ్లలో సుమారు 90 అనుమానాస్పద UPI లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం. ఒక్కో ట్రాన్సాక్షన్ ₹1,000 నుంచి ₹4,500 వరకు ఉండగా, తాత్కాలిక క్రాకర్ షాప్ లైసెన్స్‌కు నిర్ణయించిన అధికారిక ఫీజు మాత్రం ₹500.
మొత్తం 397 దరఖాస్తులు వచ్చినట్లు ACB గుర్తించగా, వాటిలో 26 ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. లైసెన్స్ కోసం వచ్చిన వారి నుంచి అదనపు డబ్బులు వసూలు చేశారా? UPI లావాదేవీలు ఎందుకు జరిగాయి? అనే కోణంలో ACB విచారణ కొనసాగిస్తోంది.
📞 లంచం అడిగితే ACB: 1064





