అమెరికా సిటీ బ్యాంక్ సెంటర్‌లో కాల్పులు.. నిందితుడు మృతి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బ్రాండన్ పరిధిలోని సాబల్ పార్క్ బిజినెస్ ఏరియాలో ఉన్న సిటీ బ్యాంక్ సెంటర్‌లోకి బుధవారం ఓ సాయుధుడు చొరబడ్డాడు.
సమాచారం అందుకున్న వెంటనే స్వాట్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించాయి.
స్థానిక యంత్రాంగం తక్షణమే ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసి, ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఈ ఆపరేషన్‌లో అనుమానితుడు మృతి చెందాడని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ చాడ్ క్రోనిస్టర్ అధికారికంగా ప్రకటించారు.
బ్యాంక్ భవనంలో ఉన్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం సిటీ బ్యాంక్ సెంటర్ భవనంలో పోలీసులు క్లియరెన్స్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.





