బెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీక్.. డెలివరీ బాయ్ తెచ్చిన సిలిండర్ తో అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరులో డెలివరీ బాయ్ తెచ్చిన గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వెలిగించిన పూజ దీపం మంటలకు గ్యాస్ తగలడంతో క్షణాల్లోనే మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గ్యాస్ సిలిండర్ల విషయంలో నిర్లక్ష్యం వద్దు! సిలిండర్ డెలివరీ సమయంలో లీకేజీ ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయండి.
గ్యాస్ వాసన వస్తే దీపాలు, అగ్గిపుల్లలు, విద్యుత్ స్విచ్‌లు ఉపయోగించకూడదు. ఒక్క చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదానికి కారణం కావచ్చు!





