🚨 రోజుకో ACB ట్రాప్.. అయినా లంచాల జోరు తగ్గట్లేదా? ఆదిలాబాద్‌లో ₹40 వేలు తీసుకుంటూ SI పట్టివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్ SI జి. రమేష్, ఓ కేసులో ఫిర్యాదుదారుడిని ఇరికించకుండా ఉండటంతో పాటు అతని మొబైల్ తిరిగి ఇచ్చేందుకు ₹50 వేలు డిమాండ్ చేసి, చివరకు ₹40 వేలకు ఒప్పుకున్నట్లు ACB తెలిపింది.
ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారంతో వలపన్నిన ACB అధికారులు, ₹40 వేలు తీసుకుంటున్న సమయంలో SIని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు, నిన్న సంగారెడ్డిలో వ్యవసాయ అధికారి ₹20 వేల లంచం కేసులో ACBకి చిక్కగా.. ఇవాళ పోలీస్ SI పట్టుబడటం రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న లంచం కేసులపై మరోసారి చర్చకు దారితీస్తోంది.
📞 లంచం అడిగితే ACB టోల్ ఫ్రీ: 1064





