ఖమ్మం బేతుపల్లి చెరువులో రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదం.. రెండు SDRF బోట్లు గల్లంతు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన SDRF బృందానికి చెందిన రెండు పడవలు వరద ఉద్ధృతిలో గల్లంతయ్యాయి.
మత్స్యకారులను రక్షించే ప్రయత్నంలో SDRF సిబ్బంది చెరువులోకి వెళ్లగా.. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బోట్లతో సంబంధం తెగిపోయినట్లు సమాచారం.
ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసి, SDRF సిబ్బందిని సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.





